భారతదేశం, జనవరి 29 -- బడ్జెట్ 2025 కేటాయింపుల గురించి అందరికీ ఆసక్తి ఉంది. బడ్జెట్ వల్ల ఏయే రంగాలు లాభపడతాయో విశ్లేషిస్తే మీరు పెట్టుబడి పెట్టినా.. మంచి రాబడులు పొందుతారు. ఒక రంగానికి సంబంధించి ఆర్థిక ప్రాధాన్యతలు నిర్ణయించడానికి బడ్జెట్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసే కేటాయింపులు, ప్రకటనలు, సంస్కరణలతో కొన్ని రంగాలకు ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు పలు రంగాల గురించి విశ్లేషించాలి. మూడు రంగాలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ బడ్జెట్‌లో పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు సంస్కరణలు తీసుకొచ్చేందుకు అవకాశం ఉందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ద...