Hyderabad, ఫిబ్రవరి 12 -- నాన్ వెజ్ ప్రియులకు మటన్‌తో చేసే వంటకాలు ఎంతో ఇష్టం. ముఖ్యంగా మటన్ లివర్తో చేసే గ్రేవీ వేపుళ్ళు ఇంకా నచ్చుతాయి. ఇక్కడ మేము మటన్ లివర్ మసాలా లేదా మటన్ లివర్ గ్రేవీ రెసిపీ ఇచ్చాము. దీన్ని అన్నంలోనే కాదు చపాతీ రోటీల్లో కూడా తినవచ్చు. ఇడ్లీ, దోశతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మటన్ లివర్ గ్రేవి చేయడం కూడా చాలా సులువు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. కచ్చితంగా మీకు నచ్చుతుంది.

నూనె - నాలుగు స్పూన్లు

ధనియాలు - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒ స్పూను

సోంపు గింజలు - అర స్పూను

మిరియాలు - ఒక స్పూను

గసగసాలు - అర స్పూను

ఎండుమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమోటో ప్యూరీ - అరకప్పు

మటన్ లివర్ - 400 గ్రాములు

పసుపు - అర స్పూను

కారం...