Hyderabad, ఫిబ్రవరి 11 -- హైదరాబాదీలకు మటన్ దాల్చా గురించి బాగా తెలుసు. అది ఉంటే చాలు ఎంత అన్నమైనా, పులావైన తినేస్తారు. టేస్టీగా జ్యూసీగా గ్రేవీగా ఉంటుంది ఈ కూర. మటన్ దాల్చాను మనం కూడా వండుకోవచ్చు. దీన్ని వండడం చాలా సులువు. మటన్ దాల్చా రెసిపీ మీకు తినాలనిపిస్తే ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి. అద్భుతంగా ఉంటుంది. మటన్ దాల్చా అంటే మటన్, పప్పు కలిపి చేసే వంటకం. ఇందులో మనం శెనగపప్పును వినియోగిస్తాము. శనగపప్పు కూడా నాన్ వెజ్ వంటకానికి మంచి రుచిని అందిస్తుంది. ఇక మటన్ దాల్చా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

శనగపప్పు - ఒక కప్పు

మటన్ - అరకిలో

పచ్చిమిర్చి -మూడు

పసుపు - అర స్పూను

ఉప్పు -రుచికి సరిపడా

కారం - రెండు స్పూన్లు

నూనె - మూడు స్పూన్లు

దాల్చిన చెక్క - రెండు ముక్కలు

లవంగాలు - మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

అనాసపువ్వు - ఒ...