భారతదేశం, డిసెంబర్ 30 -- నెరిసిన జుట్టుతో బాధపడేవారు ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. కొన్ని పదార్థాలను ఆవాల నూనెతో కలిపి జుట్టు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెన్నా లేదా మీ జుట్టుకు రంగు వేయవలసిన అవసరం లేదు. సహజ పదార్థాలతో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

నిజానికి నేటి కాలంలో చిన్నారుల నుంచి టీనేజర్ల వరకు గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. వెంట్రుకలు నెరిసిపోవడం ఒకప్పుడు వృద్ధాప్యానికి సంకేతం అయితే, ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు జుట్టు త్వరగా నెరిసిపోయేలా చేస్తున్నాయి.

వాటిని కనిపించకుండా చేసేందుకు షాపుల్లో ఎన్నో రకాల హెయిర్ డైలు దొరుకుతాయి. కానీ వాటిని వాడితే జుట్టు పాడవుతుందనేది నిజం. ఎందుకంటే ఇందులో వాడే రసాయనాలు జుట్టుకు, ఆరోగ్యానికి హానికరం. హెయిర్ కలర్, డైలో ఉండే కెమికల్స్ కారణంగా చాలా మంది స్టోర్ లో కొనే హెయిర్ కలర్ ...