Hyderabad, జనవరి 31 -- మనలో చాలా మందికి ఆవనూనెను కేవలం పూజలకు మాత్రమే వినియోగిస్తారని తెలుసు. కొన్ని ప్రాంతాలలో దీనిని వంటకాలలోకి కూడా ఉపయోగిస్తారట. ఈ నూనె నుంచి వచ్చే వాసన కారణంగా మనలో చాలా మందికి దీనిని వంటనూనెగా వినియోగిస్తే నచ్చకపోవచ్చు. కానీ, దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే, వాసన వచ్చినా పరవాలేదు. వాడేద్దామని ఫిక్సయిపోతారట. శరీరంలోని అవయవాలకే కాకుండా బయట కనిపించే చర్మానికి కూడా ఆరోగ్యం కలుగుజేస్తుందట. చర్మానికి ఆవనూనె ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

ఆవనూనె అనేది ఆవగింజల నుండి తీసిన నూనె. ఇది ప్రధానంగా భారతదేశంలో, దక్షిణ ఆసియా వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఈ నూనె నుంచి బలమైన వాసన, అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉంటాయి. కేవలం వంటకాల్లోనే కాకుండా, ఆవనూనె చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో ఇది నిరూపితమైంద...