భారతదేశం, ఏప్రిల్ 13 -- కారు కొనడం అనేది చాలా మంది కల! మరి మీరు కొత్తగా కారు కొంటున్నారా? మంచి కారులో ఎలాంటి సేఫ్టీ, కంఫర్ట్​ ఫీచర్స్​ ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ 2025లో కారు కొంటుంటే, కచ్చితంగా ఉండాల్సిన ఫీచర్స్​ లిస్ట్​లో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి. ఈ డేటా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎయిర్​బ్యాగ్స్​- సేఫ్టీలో అత్యంత ముఖ్యమైనవి ఎయిర్​బ్యాగ్స్​. ఇప్పుడు అఫార్డిబుల్​ కార్లలోనూ వీటిని స్టాండర్డ్​గా ఇస్తున్నారు. కారు, వేరియంట్​ బట్టి 2,4,6 ఎయిర్​బ్యాగ్స్​ వస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్యాసింజర్లు డ్యాష్​బోర్డు, స్టీరింగ్​ వీల్​, విండ్​షీల్డ్​ని ఢీకొట్టకుండా ఇవి అడ్డుకుంటాయి. సైడ్​ ఎయిర్​బ్యాగ్స్​ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

రివర్స్​ సెన్సింగ్​ సిస్టెమ్​- కొందరికి కారు రివర్స్​ తిప్పుతున్నప్పుడు, ...