Hyderabad, ఫిబ్రవరి 3 -- చాలా మందికి రోజంతా బద్దకంగా, నీరసంగా అనిపిస్తుంది. శరీరంలో సోమరితనం, మనసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వారు సమర్థవంతంగా ఏ పని చేయలేరు, ఆఫీసులో, ఇంట్లో ఏ పని మీద ధ్యాస పెట్టలేరు. రోజంతా వృధా అవుతుంది. మీరు కూడా ఇలాంటి లక్షణాలతోనే ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. వీటి నుంచి బయట పడాలంటే ఉదయాన్నే లేవగానే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వీటిని దినచర్యగా మార్చుకుని అనుసరించారంటే మీరు రోజంగా ఉత్సాహంగా ఉంటారు, సమర్థవంతంగా పని చేయగలగుతారు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలిగిస్తాయి. అవేంటో తెలుసుకోండి.

ఉదయం త్వరగా లేవడం అనేది ఎల్లప్పుడూ మంచి అలవాటు. త్వరగా అంటే మీరు కళాశాలకు, ఆఫీసుకు లేదా పనికి వెళ్ళే సమయానికి కనీసం రెండు గంటల ముందే లేవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ...