Hyderabad, ఫిబ్రవరి 23 -- చలికాలం ముగిసిపోతుంది కొద్దికొద్దిగా ఎండలు ముదురుతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వాతావరణానికి అనుగుణంగా వ్యక్తులు తమ ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అందంతో పాటు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం, పోషకాలతో నిండిన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. సూర్యుడి తాపాన్ని తట్టుకోవాలంటే మీరు కూడా మీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. అలాగే పోషకాలతో నిండిన కొన్ని గింజలను తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోండి. వేసవి కాలంలో తప్పకుండా తినాల్సిన నాలుగు రకాల గింజలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నలుపు లేదా తెలుపు రంగులో ఉండే చియా గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వేస...