Hyderabad, ఫిబ్రవరి 10 -- వ్యాపారం చేయడం చాలా మంది కల. త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని చాలా మంది కోరుకుంటారు. కొందరికి వ్యాపారం చేయడానికి తగినంత డబ్బు, మరికొందరికి స్థలం ఉండదు. అలాంటి వారికి పుట్టగొడుగుల పెంపకం ఆశాజనకమైన బిజినెస్ అని చెప్పుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పరిశ్రమ.

పుట్టగొడుగుల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో పుట్టగొడుగుల పెంపకాన్ని ఇంట్లోనే ప్రారంభించవచ్చు.

విటమిన్ డి ఉండే ఏకైక కూరగాయ పుట్టగొడుగు. ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా వైద్యులు సిఫార్సు చేస్తారు. చిన్న చిన్న ప్లాట్లలో కూడా పుట్టగొడుగులను పెంచడం ద్వారా నెలకు వేలాది రూపాయలు సంపాదించవచ్చు. ...