Hyderabad, జనవరి 30 -- పుట్టగొడుగుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వారానికి ఒక్కసారైనా వీటితో రకరకాల వంటలు తినడం ముఖ్యం. పుట్టగొడుగుల బిర్యాని, పుట్టగొడుగుల కూర, పుట్టగొడుగుల ఇగురు. పుట్టగొడుగుల వేపుడు ఇలా ఏది చేసినా ఇది రుచిగా ఉంటుంది. ఇక్కడ మేము పుట్టగొడుగుల వేపుడు రెసిపీ ఇచ్చాము. దీన్ని అన్నంలోనే కాదు చపాతీలతో తిన్నా రుచిగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పుట్టగొడుగులు - 200 గ్రాములు

పసుపు - అర స్పూను

నీళ్లు - తగినన్ని

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయలు - రెండు

నూనే - రెండు స్పూన్లు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - మూడు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - మూడు

కారం - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

మిరియాల పొడి - పావు స్పూ...