Hyderabad, ఫిబ్రవరి 4 -- ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మరి దీని కోసం కష్టం కూడా అంతే ఉంటుంది. చాలా మంది తమ బాడీని మంచి షేప్ లోకి తెచ్చుకోవడానికి ఎంత కష్టమైనా పడటానికి సిద్ధంగా ఉంటారు. కానీ, జిమ్ కు వెళ్లే డబ్బులు లేకనో, సమయం కుదరకనో వాయిదా వేసుకుంటూ కాలం గడిపేస్తారు. ఇక అంతే, బరువు తగ్గాలనుకునే కల, అలాగే మిగిలిపోతుంది. ఇంకొందరిలో అయితే కండలు పెంచాలనుకునే కోరిక వయస్సు పెరుగుతున్న కొద్దీ కలగానే ఉంటుంది. వాస్తవానికి కండలు పెంచాలనుకునే కలను జిమ్‌కు వెళ్లకుండానే సాధ్యం చేసుకోవచ్చట. కొద్దిపాటి వ్యాయామాలతో కండరాలను బలంగా మార్చుకోవచ్చట. అవేంటో తెలుసుకుందామా..

ఛాతీ, భుజాలు, ట్రైసెప్స్‌ను బలపరచడానికి పుష్‌అప్స్ చేయండి. దీన్ని చేయడానికి, పొట్టను నేలకు ఆనిస్తూ పడుకోండి. మీ భుజాల వెడల్పు కంటే కొంచెం ఎక్కువ వెడల్పుతో అరచేతులను నేలకు ఆనించండి. ఇ...