Hyderabad, ఏప్రిల్ 8 -- మునక్కాడలు, మునగ ఆకులు, మోరింగా... ఎలా పిలిచినా అవేంటో అర్థం అయిపోతుంది. ఇవి ఇప్పుడు సూపర్ ఫుడ్ గా మారుతున్నాయి. మునగ ఆకులను గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే మునక్కాయలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. మనకు కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు... మునగకాయలు, మునగ ఆకుల్లో నిండుగా ఉంటాయి.

మునగ ఆకుల నీటిని కషాయంగా తీసుకుంటే మీకు ఎన్నో అద్భుత ఫలితాలు వస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు పొడవుగా పెరగాలనుకునేవారు మునగ కాయలను ఎలా వినియోగించాలో తెలుసుకోండి.

మునగకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే బి విటమిన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి మన తలకు కావలసిన పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి అవి పెరిగేలా చేస్తాయి. జుట్టు మెరిసేలా చేయడ...