Hyderabad, ఫిబ్రవరి 23 -- Mumaith Khan Hair And Beauty Academy Launch: టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుందు ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు అనే పాటతో సెన్సేషనల్ అయిపోయింది. ఆ తర్వాత పలు ఐటమ్ సాంగ్స్ చేసి మెప్పించిన ముమైత్ ఖాన్ కొన్ని పాత్రల్లో అలరించింది. అయితే, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ముమైత్ ఖాన్ బ్యూటీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.

బ్యూటీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌లో కొత్త శకానికి నాంది పలుకుతూ యూసుఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్, వెల్‌నెస్‌లో నైపుణ్యంపైన అవగాహణ కల్పించారు.

ఈ కార్యక్రమంలో వీలైక్ అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్‌తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్స ఖాన్, స...