తెలంగాణ,వరంగల్, మార్చి 21 -- ములుగు జిల్లా ఏజెన్సీ ఏరియా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంకటాపురం మండలం వీరభద్రవరం శివారు అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలగా, ఈ ఘటనలో వెదురుబొంగుల కోసం వెళ్లిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

మరో ముగ్గురు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. క్షతగాత్రుడిని హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా రాష్ట్ర సరిహద్దుల్లో తరచూ ఎన్ కౌంటర్లు జరుగుతున్న సమయంలో ములుగు అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, నర్సింగరావుతో పాటు మరో ఇద్దరు యువకులు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వెదురు బొంగుల కోసమని వీరభద్రవరం గ్...