Warangal,mulugu, ఏప్రిల్ 12 -- ఓ వైపు ఆపరేషన్ కగార్ దడ పుట్టిస్తున్న వేళ.. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్ లో పని చేస్తున్న 22 మంది దళ సభ్యులు ఒకేసారి లొంగిపోయారు. ములుగు ఎస్పీ శబరీశ్ ఎదుట వారు సరెండర్ అయ్యారు. అందులో ఏడుగురు మహిళా సభ్యులు, 15 మంది పురుషులు కాగా.. ఒకేసారి ఇంతమంది పార్టీ వీడి జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టడం స్థానికంగా సంచలనం రేపింది. 22 మంది లొంగుబాటుకు సంబంధించిన వివరాలను ములుగు ఎస్పీ శబరీశ్ శుక్రవారం వెల్లడించారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడానికి మాడవి మాస 2010లో మావోయిస్టు పార్టీలో చేరాడు. దళ సభ్యుడిగా చేరిన ఆయన కమాండర్ ఇడుమా ఆధ్వర్యంలో వివిధ ఘటనల్లో పాల్గొన్నాడు. 2013లో ఏసీఎం మెంబర్ గా ప్రమోషన్ పొందాడు. 2017లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బెజ్జి పోలీస్‌ స్టేష...