భారతదేశం, ఫిబ్రవరి 5 -- స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు మల్యీబ్యాగర్ రాబడిని ఇచ్చిన అనేక పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. అలాంటి పెన్నీ స్టాక్ రాజ్ రేయాన్. మంగళవారం ఈ స్టాక్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.97 శాతం పెరిగి.. 20.21 వద్ద ముగిసింది.

రాజ్ రేయాన్ స్టాక్స్ పెట్టుబడిదారులపై గత 5 ఏళ్లలో డబ్బు వర్షం కురిపించింది. రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1993లో స్థాపించారు. ఇది పాలిస్టర్ చిప్స్ తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తుల జాబితాలో ట్రైలోబల్, కోట్‌లాక్, ఫైర్ రిటార్డెంట్, ఆక్టాలోబల్ నూలు ఉన్నాయి. ఇది తన ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇందులో బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, పెరూ, స్పెయిన్, సిరియా, థాయిలాండ్, వియత్నాం ఉన్నాయి.

ఈ స్టాక్ గత కొంతకాలంగా పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తోంది. ఎన్ఎస్...