భారతదేశం, జనవరి 26 -- ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ షేర్లు పెట్టుబడిదారులకు మంచి రాబడులను ఇచ్చాయి. 2004 జూలై 17న కంపెనీ షేరు ధర రూ.3గా ఉండేది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 26,900 శాతం పైకి వెళ్లింది. శుక్రవారం రూ.810 వద్ద క్లోజ్ అయింది. వచ్చే వారం కంపెనీ షేర్లపై ఫోకస్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఈ సంస్థ నిధులు సమీకరించబోతోంది.

క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) ప్రక్రియ ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ జనవరి 23న ప్రకటించింది. క్యూఐపీ ఫండ్ రైజింగ్ ప్రక్రియ అనేది స్టాక్ మార్కెట్లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) వంటి పెద్ద పెట్టుబడిదారులకు తమ సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలకు నిధులను సేకరించే ప్రక్రియ. క్యూఐపీ ఇష...