భారతదేశం, మార్చి 14 -- Multibagger small cap penny stock: దాదాపు గత 6 నెలలుగా స్టాక్ మార్కెట్ పతనం దిశగా వెళ్తోంది. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిలో నష్టాలను చవి చూస్తోంది. ఈ పరిస్థితుల్లోనూ కొన్ని స్టాక్స్ ఈ బేరిష్ ట్రెండ్ ను అధిగమించగలిగాయి. వాటిలో ఒకటి స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్ అయిన కొఠారి ఇండస్ట్రియల్ కార్పోరేషన్. ఇది భారీ అమ్మకాల మధ్య కూడా నిలకడగా ఉన్న స్టాక్ లలో ఒకటి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లో 20.10 శాతం క్షీణతతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు 84 శాతం పెరిగాయి.

కొఠారి ఇండస్ట్రియల్ కార్పోరేషన్ స్టాక్ గత ఆరు నెలల్లో 280 శాతం రాబడిని అందించింది. 12 నెలల్లోనే ఈ షేరు ధర రూ.1.80 నుంచి రూ.159.25కు పెరిగింది. అంటే 8,747 శాతం రాబడి. 12 నెలల క్రితం ఈ కంపెనీ స్టాక్స్ ను రూ. 1 లక్షపెట్టి కొనుగోలు చేసి, వాటిని మళ్లీ అమ్మేయకుం...