భారతదేశం, ఫిబ్రవరి 14 -- Multibagger stock: ప్రస్తుతం రూ. 50 కన్నా తక్కువ ధరకు లభిస్తున్న ఒక మల్టీబ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్ భవిష్యత్తులో మంచి రిటర్న్ లను ఇస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ సూచిస్తోంది. మల్టీ బ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్ ''వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్'' సమీప భవిష్యత్తులో కనీసం 32 శాతం పెరుగుతుందని ఆనంద్ రాఠీ అంచనా వేస్తోంది.

'వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్'' స్టాక్ రూ.51.75 వద్ద ప్రారంభమై, బ్రాడ్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులతో వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ షేరు ధర ఇంట్రాడేలో 3 శాతానికి పైగా క్షీణించి రూ.49.06 వద్ద ముగిసింది. వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు ధర ఈ సంవత్సరం ఇప్పటివరకు 11.15 శాతం క్షీణించింది. రెండేళ్ల క్రితం అంటే 2023 ఫిబ్రవరిలో రూ.15- రూ.16 స్థాయిలో ట్రేడ్ అయిన వన్ పాయింట్ వన్ సొల్...