భారతదేశం, ఏప్రిల్ 5 -- Multibagger stock: 2025 లో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతోంది. 2024 సెప్టెంబర్ నుంచి అడపాదడపా లాభాలు తప్పించి, వరుసగా నష్టాల్లో కొనసాగుతోంది. ఈ కరెక్షన్ ఫేజ్ లో కూడా కొన్ని స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2025 అందించిన అలాంటి అరుదైన మల్టీబ్యాగర్ స్టాక్స్ లో ఒకటి ఫ్యాబ్ టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్. ఈ బీఎస్ఈ ఎస్ఎంఈ స్టాక్ 2025 జనవరిలో ప్రైమరీ మార్కెట్లోకి ఐపీఓగా వచ్చింది. 2025 జనవరి 10 న బీఎస్ఈ ఎస్ఎంఈ ఎక్స్ఛేంజ్ లో 90 శాతం భారీ లాభంతో లిస్ట్ అయింది. డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల కారణంగా భారత స్టాక్ మార్కెట్ కుదేలైనప్పటికీ, ఈ ఎస్ఎంఈ స్టాక్ మాత్రం కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంది. ఈ స్టాక్ లిస్టింగ్ అయిన మూడు నెలల్లోనే రూ.350.80 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. పబ్లిక్ ఇష్యూ ధర రూ.85తో పోలిస్తే...