భారతదేశం, ఫిబ్రవరి 2 -- Mudragada House Attack : వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నివాసంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి గేట్ ను ట్రాక్టర్ తో ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న కారును సైతం ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసున్న పోలీసులు విచారించారు. దాడి వెనుక రాజకీయ కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. తనకు రూ.50 వేలు ఇస్తానంటే దాడి చేసినట్లు యువకుడు చెప్తున్నాడని ముద్రగడ అనుచరులు అంటున్నారు. దాడికి పాల్పడింది జనసేన కార్యకర్త అని ముద్రగడ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది. ముద్రగడ అంటే పవన్‌ కల్యాణ్ కు, జనసేన నేతలకు గౌరవం ఉందన్నారు. జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్‌ మాట్లాడుతూ...ఈ దాడికి జనస...