భారతదేశం, ఏప్రిల్ 11 -- సిట్రోయెన్​ ఇండియాకు బ్రాండ్​ అంబాసిడర్​గా ఉన్న భారత మాజీ క్రికెటర్​ ఎంఎస్​ ధోనీ గ్యారేజ్​లో మరో కారు చేరింది. సిట్రోయన్​ బసాల్ట్​డార్క్​ ఎడిషన్​కి చెందిన మొదటి యూనిట్​ని ధోనీకి డెలివరీ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

సిట్రోయెన్ ఇండియా బసాల్ట్, సీ3, ఎయిర్​క్రాస్ వంటి తన పోర్ట్​ఫోలియోలోని మోడల్స్​కి డార్క్ ఎడిషన్​ని భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. కొత్త వెర్షన్లు టాప్-ఎండ్ వేరియంట్ల ఆధారంగా వస్తున్నాయి. ఇవి లిమిటెడ్ ఎడిషన్​గా ఉంటాయి. ఇందులో భాగంగనే సిట్రోయెన్ బసాల్ట్ బ్లాక్ ఎడిషన్​ని సంస్థ బ్రాండ్ అంబాసిడర్​గా ఉన్న ధోనికి డెలివరీ చేశారు.

సిట్రోయెన్ సీ3 డార్క్ ఎడిషన్ ధర రూ.8,38,300, ఎయిర్​క్రాస్ డార్క్ ఎడిషన్ ధర రూ.13,13,300, బసాల్ట్ డార్క్​ ఎడిషన్ ధర రూ.12,80,000. ఇవన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

ఈ మూడు ఎస్​యూవీ...