భారతదేశం, మార్చి 16 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍కు ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీ నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో మూవీ (RC16) చేస్తున్నారు చరణ్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. కండలు బాగా పెంచేశారు చెర్రీ. ఈ మూవీపై ప్రస్తుతం ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇవే..

రామ్‍చరణ్ - బుచ్చిబాబు మూవీలో భారత దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్యామియో రోల్‍లో కనిపించనున్నారంటూ తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంతో ధోనీ తెరంగేట్రం చేయనున్నాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి.

క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍ ఉండే ఆర్‌సీ16లో రామ్‍చరణ్‍కు కోచ్‍గా కాసేపు ధోనీ కనిపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై మూవీ టీమ్ నుం...