Hyderabad, ఫిబ్రవరి 11 -- మిసెస్ ఇండియా పోటీలు వైభవంగా ముగిశాయి. రాష్ట్ర స్థాయిలో విజేతలను ప్రకటించారు. మిసెస్ ఇండియాగా మారాలంటే వయసుతో పనిలేదని ఈ పోటీలు చాటుతున్నాయి. మిసెస్ ఇండియా తెలంగాణ గ్రాండ్ ఫినాలేను 2025 జనవరిలో మమతా త్రివేది నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఇప్పుడు సెప్టెంబర్ 2025లో నిర్వహించనున్న మిసెస్ ఇండియా జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు.

మిసెస్ ఇండియా పోటీలను శ్రీమతి దీపాలి ఫడ్నిస్ 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. శ్రీమతి మమతా త్రివేది 2017లో మిసెస్ ఇండియా తెలంగాణ, మిసెస్ ఇండియా, మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ ప్రపంచ కిరీటాలను గెలుచుకున్నారు. 2018 నుండి మిసెస్ ఇండియా తెలంగాణ పోటీలను నిర్వహిస్తున్నారు.

జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే మిసెస్ ఇండియా తెలంగాణ విజేతల వివరాలు ఇక్కడ ఉన్...