భారతదేశం, ఫిబ్రవరి 14 -- MRF Factory Workers : మెదక్ జిల్లా సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 350 మందికి పైగా కార్మికులను పర్మినెంట్ చేయాలని అడిగినందుకు తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈరోజు ఉదయం డ్యూటీకి వచ్చినా కార్మికులను గేటు బయటనే అడ్డుకోవడం దుర్మార్గమని తక్షణమే కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వి.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎంఆర్ఎఫ్ అంకనపల్లి ప్లాంట్ కార్మికులను కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని, ఆపరేటర్ గా పనిచేస్తున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అకారణంగా కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. నాలుగు సంవత్సరాల నుం...