భారతదేశం, మార్చి 6 -- MPHA Jobs: ఉమ్మడి ఏపీలో నియమించిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు కొన్ని దశాబ్దాలుగా వైద్య ఆరోగ్యశాఖలో సేవలందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రభుత్వం కూడా సానుకూల వైఖరినే అనుసరిస్తోందని ఆయన వివరించారు. హెల్త్‌ అసిస్టెంట్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలను ఇటీవల తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రుష్టికి తీసుకు వెళ్లినట్టు వివరించారు.

ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారని, న్యాయ పరిమితులకు లోబడి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారని వివరించారు. ఇటీవల కొంతమంది ఒప్పంద ఉద్యోగులను తొలగించడంపై మంత్రి వివరణ ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

హెల్త్ అసిస్టెంట్ల నియామక సమస్య రెండున్నర ద...