భారతదేశం, మార్చి 16 -- Robber Enters MP DK Aruna House : సాధారణంగా దుండగులు...తాళాలు వేసి ఉన్న ఇండ్లు, భద్రత తక్కువగా ఉండే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే భద్రత ఎక్కువ ఉన్న ఇండ్లలో కూడా దుండగులు చోరీలకు యత్నిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరబడిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు హల్ చల్ చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడడం చర్చనీయాంశమైంది. బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 56లో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని, ముఖానికి మాస్క్‌ కట్టుకుని ఎంపీ ఇంట్లోకి చొరబడ్డాడు. దాదా...