భారతదేశం, జనవరి 5 -- ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ ఉంది. ముందుగా ఈ రేసులో మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం రానుంది. పండుగకు ముందే జనవరి 10వ తేదీన ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుంది. రెండు రోజుల గ్యాప్‍లో జనవరి 12న నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇలా ఈ మూడు చిత్రాలు ఈసారి సంక్రాంతి పండుగ బరిలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. జీవోలను జారీ చేసింది.

గేమ్ ఛేంజర్ చిత్రానికి ఎక్కువ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై అదన...