భారతదేశం, జనవరి 27 -- జనవరిలో సంక్రాంతి సందర్భంగా తెలుగు సినిమాల సందడి బాగా కనిపించింది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫిబ్రవరిలోనూ తెలుగు సినిమాల జోరు ఉండనుంది. తండేల్ చిత్రంపై క్రేజ్ భారీగా ఉంది. వాలెంటైన్స్ డే రోజున మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. ఫిబ్రవరిలో థియయేటర్లలో రిలీజ్ కానున్న టాప్-5 తెలుగు సినిమాలో ఏవో ఇక్కడ తెలుసుకోండి.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'తండేల్' సినిమా ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగచైతన్య నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు చందూ మొండేటి. లవ్ స్టోరీ, దేశభక్తి కలబోతతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తండేల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ...