Hyderabad, ఏప్రిల్ 2 -- Movie Tickets: హిందీ సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలోనే అతి గొప్ప వాటిలో ఒకటిగా మొఘల్ ఎ ఆజంకు పేరుంది. కే ఆసిఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టికెట్ల కోసం ఆ కాలంలోనే ఎంతో మంది ప్రేక్షకుల రోజుల తరబడి రోడ్లపై టికెట్ల కోసం వేచి చూశారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి ఈ మధ్యే నటుడు రజా మురాద్ గుర్తు చేసుకున్నాడు.

మొఘల్ ఎ ఆజం మూవీలో రాజా మాన్ సింగ్ పాత్రలో నటించిన హమీద్ అలీ తనయుడే రజా మురాద్. ఇప్పుడతడు ఆ సినిమా గురించి ఏఎన్ఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దిలీప్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మధుబాలలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ పెను సంచలనం. ఈ సినిమా టికెట్ల కోసం జనం 5 కి.మీ. క్యూ లైన్లో ఓపిగ్గా ఎదురు చూసేవారని రజా మురాద్ చెప్పుకొచ్చాడు.

"సోమవారం షో కోసం శనివారం ...