భారతదేశం, ఏప్రిల్ 2 -- Motorola Edge 60 Fusion: మోటరోలా తన ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ లైనప్ ను మరింత విస్తరించింది. తాజాగా, ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో 2 ఏప్రిల్ 2025 న మోటరోలా లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ తరువాత వచ్చిన తాజా హ్యాండ్ సెట్ ఇది. ఇందులో బలమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ సెట్ తో సహా అనేక గుర్తించదగిన అప్ గ్రేడ్ లు ఉన్నాయి.

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ తో పాటు అధికారిక మోటరోలా ఇండియా వెబ్సైట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు, ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇది ...