భారతదేశం, సెప్టెంబర్ 28 -- ప్రస్తుతం దేశంలో ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ నడుస్తోంది. ఈ సేల్​లో మంచి మంచి స్మార్ట్​ఫోన్స్​ తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కొత్త గ్యాడ్జెట్​ తీసుకోవాలని చూస్తుంటే.. మోటో జీ96 5జీని పరిగణించాల్సిందే! ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మోటో జీ96 5జీ స్మార్ట్‌ఫోన్ 6.67-ఇంచ్​ ఫుల్-హెచ్‌డీ+ (10-బిట్) 3డ కర్వ్డ్ పీఓఎల్​ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ బ్రైట్‌నెస్ స్థాయి, వాటర్ టచ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్​ జెన్ 2 ఎస్ఓసీతో పనిచేస్తుంది. దీనికి 8జీబీ LPDDR4x RAM, 256జీబీ వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కనెక్ట్​ చేసి ఉంటుంది.

ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత హలో యూఐ స...