భారతదేశం, డిసెంబర్ 6 -- Moto G13 Launch update : మోటోరోలా నుంచి ఇండియా మార్కెట్​లోకి మరో స్మార్ట్​ఫోన్​ రానుంది. ఎక్స్​టీ2331 పేరుతో ఉన్న ఈ స్మార్ట్​ఫోన్​ని బీఐఎస్​ అథారిటీతోపాటు థాయ్​లాండ్​కు చెందిన ఎన్​బీటీసీ సర్టిఫికేషన్​ ప్లాట్​ఫామ్​ ఆమోదించాయి. కాగా.. థాయ్​లాండ్​లో.. మోటో జీ13 పేరుతో ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా అదే పేరుతో ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎన్​బీటీసీ డేటాబేస్​లో ఎక్స్​టీ2331-3 పేరుతో ఈ మోటో జీ13 దర్శనమిచ్చింది. ఇండియాలో ఎక్స్​టీ2331-2 మోడల్​ నెంబర్​ పేరు ఉంది. ఇండియాలో లాంచ్​ కానున్న ఈ స్మార్ట్​ఫోన్​కు ఇప్పటికే ఎఫ్​సీసీ అథారిటీ నుంచి సర్టిఫికేట్​ వచ్చినట్టు తెలుస్తోంది.

Moto G13 price : ఎఫ్​సీసీ లిస్టింగ్​ ప్రకారం.. మోటో జీ13లో 5000ఎంఏహెచ్​ బ్యాట...