Hyderabad, మార్చి 28 -- డబ్బు లేనిదే లోకమే లేదు నిజమే! కానీ ఈ లోకంలో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయని తెలుసుకోండి. డబ్బు ఉంటేనే మనుషులు విలువనిస్తారు, కానీ అదే డబ్బు విలువలతో కూడిన జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు. ధనం చేతిలో ఉంటే మనుషులను పెట్టుకుని పని చేయించుకోగలుగుతాం. కానీ వారి మనసుల్లో ప్రేమను మాత్రం పుట్టించలేమం. డబ్బు అంటే ఎన్నో రకాల సౌకర్యాలను అనుభవించవచ్చు కానీ బంధాలు ఇచ్చే సంతోషాన్ని, సౌఖ్యాన్ని సంపాదించుకోలేం. విలాసవంతమైన జీవితాన్ని డబ్బుతో కొనచ్చు కానీ వ దాంతో బంధాల మధ్య ఉండే విలువలను, విలువైన మనుషులను కాపాడుకోలేం. ఈ తండ్రీ కొడుకుల కథ చదివితే ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

బాగా ధనవంతుడైన ఒక తండ్రి తాము ఎంత అదృష్లవంతులో తన కొడుకుకు అర్థం అయ్యేలా చెప్పాలనుకుంటారు. వాళ్లు ఎంత సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నారో తెలియజేయడమే ఆ తండ్ర...