Hyderabad, జనవరి 28 -- శృతి, జెన్సన్... వీరిద్దరి చిన్నప్పటి స్నేహం, పెద్దయ్యాక ప్రేమగా మారింది. ఆ ప్రేమను గెలిపించేందుకు ఇద్దరూ తమ కుటుంబాలతో మాట్లాడారు. వీరి స్వచ్ఛమైన ప్రేమ ముందు కుటుంబాలు కూడా తలొగ్గాయి. వారిద్దరికీ పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాయి. అప్పటికే శృతి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో జాబ్ చేస్తోంది. జెన్సన్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని విషాదం వారి కలలను కల్లలు చేసింది. కేరళలో వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి వందల మంది మరణించారు. అందులో శృతి కుటుంబం కూడా ఉంది. ఆమె తల్లి, తండ్రి, చెల్లి, అత్త, మావయ్య ఇలా మొత్తం తొమ్మిది మంది శృతికి దూరమయ్యారు. కుటుంబంలో శృతి మాత్రమే మిగిలిపోయింది. ఆమె పెళ్లి కోసం దాచిన నగలు, డబ్బు అన్నీ పోయాయి. ఆ సమయంలో ఆమెకు అండగా నిలిచింది. ఆమెను స్వచ్ఛంగా ప్రేమించిన జెన్సన్ మాత్రమే.

కుటుంబం లేకపోయినా తా...