Hyderabad, మార్చి 18 -- మనిషి జీవితంలో ఓటమిని తీసుకోలేడు. గెలుపు మాత్రమే కావాలనుకుంటాడు. నిజానికి ఈ ప్రపంచంలో బతకాలంటే మొదట చేయాల్సింది ఓడిపోవడమే. ఓడిపోయినప్పుడే మనం ఏంటో, మన వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. గెలుపు చెప్పే పాఠం కన్నా ఓటమి నేర్పే గుణపాఠం జీవితాంతం గుర్తుంటుంది.

ఓటమి తర్వాత గెలుపు చాలా ఘనంగా ఉంటుంది. సింహం రెండడుగులు వెనక్కి వేసి ముందుకు దూకి ఎంత గట్టిగా పంజా విసురుతుందో ఓసారి గుర్తుకుతెచ్చుకోండి. అదే రేంజ్ లో గెలుపు కూడా ఉంటుంది. దానికి ముందుగా మీరు ఓటమిని చవి చూడాలి. ఓటమి వద్దు అనుకుంటే గెలుపు రుచిని పూర్తిగా ఆస్వాదించలేరు.

పరాజయాలకు భయపడే వ్యక్తి ఎప్పటికీ విజేత కాలేడు. ఓటమి రుచి చూడకపోతే ఈ సమాజంలో జీవించడం మీకు ఎప్పటికీ రాదు. ఎన్నిసార్లు ఓడిపోతారో... మీరు అంతగా రాటు దేలుతారు. ఈ ప్రపంచంలో ఎలాంటి వారినే తోనైనా జీవించే సామర్థ్యం,...