Hyderabad, మార్చి 11 -- అత్త, కోడళ్ల మధ్య సంబంధం చాలా సున్నితమైనది. ఈ రిలేషన్ షిప్ ను తెలివిగా హ్యాండిల్ చేస్తే అది ఎంతో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఈ బంధం చాలా తేలికగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే వీరు గొడవపడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సిన బంధం అత్తాకోడళ్ల అనుబంధం.

పెళ్లయిన తర్వాత అత్తవారింటికి వచ్చిన అమ్మాయికి కొంచెం భయం ఉంటుంది. అలాంటప్పుడు అత్తగారి ప్రవర్తన కోడలి పట్ల సానుకూలంగా ఉంటే ఆ బంధంలో ప్రేమ చిగురించడం మొదలవుతుంది. మరోవైపు అత్తగారు విషపూరితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే ఆ బంధం రోజురోజుకూ చెడిపోవడం మొదలవుతుంది. ఈ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరు వైపుల నుంచి ఉండాలి. కానీ కోడలు కోటి ప్రయత్నాలు చేసినా అత్తగారు ఆమెతో సరిగా ప్రవర్తించరు. అత్తగారి ప్రవర్తన వల్ల కోడలు బతకడం కష్టంగా మారడమే కాకుండా ఇంట్లో గొడవ వ...