Hyderabad, ఫిబ్రవరి 14 -- ఏ తల్లిదండ్రులై జీవించేది వారి పిల్లల కోసమే. తమకు పుట్టిన పిల్లలందరూ వారికి ప్రాణమే. వారు తమ పిల్లలపై నిస్వార్థంగా సమానమైన ప్రేమ, శ్రద్ధను అందిస్తారు. అయినప్పటికీ, తల్లికి తమ కూతుళ్లకన్నా కొడుకు ఎక్కువగా దగ్గరవుతాడు. అదే కుమార్తెలు తమ తండ్రితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు. దీని వెనుక ఉన్న కారణాన్ని మానసిక నిపుణులు వివరిస్తున్నారు.

అమ్మ, కొడుకుల మధ్య బంధం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రేమ, అవగాహన, పరస్పర విశ్వాసంతో నిండి ఉంటుంది. తల్లే తన ముద్దుల కొడుకుకు మొదటి ఉపాధ్యాయురాలు, ఉత్తమ స్నేహితురాలు కూడా. ఇదే వారి బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కొడుకు తండ్రి కన్నా తల్లితోనే తన మనసులోని భావాలను స్వేచ్ఛగా చెప్పగలడు. తన కష్టాన్ని, ఇష్టాన్ని తల్లితోనే చెప్పుకుంటాడు. వీరి బంధం ఎంతో అందంగా ఉంటుంది.

ఒక తల్లి తన కొడుకును ఎ...