Hyderabad, ఏప్రిల్ 2 -- Most Watched Web Series: కేవలం నాలుగు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఒకటి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ పేరు అడొలెసెన్స్ (Adolescence). ఈ ఓటీటీలో ఇప్పటి వరకూ ఎంతో పేరుగాంచిన రెండు వెబ్ సిరీస్ లను తాజాగా ఈ అడొలెసెన్స్ వెనక్కి నెట్టింది. వ్యూయర్‌షిప్ పరంగా స్ట్రేంజర్ థింగ్స్ 3, బ్రిడ్జర్టన్ సీజన్ 2 కిందికి పడిపోయాయి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ అడొలెసెన్స్. ఈ సిరీస్ ఇప్పటికే 96.7 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఆల్ టైమ్ బెస్ట్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ 9వ స్థానానికి దూసుకురావడం విశేషం. దీంతో 94.3 మిలియన్ల వ్యూస్ తో స్ట్రేంజర్ థింగ్స్ 10వ స్థానానికి పడిపోగా.. బ్రిడ్జర్టన్ సీజన్ 2 93...