Hyderabad, మార్చి 21 -- ప్రపంచంలోనే అతి ఖరీదైన శునకాన్ని బెంగళూరుకు చెందిన వ్యక్తి కొన్నారు. ఈ వార్త వైరల్ గా మారింది. ఒక శునకం కోసమే అన్ని కోట్లు ఖర్చుపెట్టారంటే ఆ కొన్న వ్యక్తి ఎంత ఆస్తిపరుడో అనుకుంటారు. అతడిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. అలా బెంగళూరుకు చెందిన ఓ కుక్క ప్రేమికుడు సతీష్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఈ కుక్కను చూసేందుకు సతీష్ ఇంటి చుట్టూ జనాలు చేరిపోతున్నారు.

బెంగళూరుకు చెందిన ఎస్.సతీష్ కడబాంబ్ ఓకామి అనే జాతికి చెందిన శునకాన్ని కొనుగోలు చేశారు. ఇది చూసేందుకు తోడేలులా కనిపిస్తుంది. ఈ కుక్కను అడవి తోడేలు, కాకేసియన్ షెప్పర్డ్ జాతి కుక్కల సంకరణతో జన్మించిది. అంటే ఇది తోడేలు, కుక్కకు కలిపి జన్మించినదన్న మాట. అందుకే ఇది తోడేలులా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తోడేలు కుక్కగా చెప్పుకుంటారు.

51 ఏళ...