Hyderabad, మార్చి 31 -- జీవితంలో విజయం సాధించాలంటే మనసులో సానుకూల అంశాలు, ప్రేరణ ఉండటం ముఖ్యం. మన చుట్టూ ఎంత మంది పాజిటివ్ వ్యక్తులు ఉన్నా మన మనసు నుంచి ప్రేరణ లేకపోతే ముందుకు సాగలేం. మీ మనస్సులో ప్రేరణ ఉంటే, మీరు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడి విజయం సాధిస్తారు. మీరు నిరంతరం వైఫల్యాన్ని ఎదుర్కొంటుంటే మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ 7 పనులు చేయడం ప్రారంభించండి. కొద్ది రోజుల్లో, మీ మనస్సులో సానుకూల ఆలోచనలు మొదలవుతాయి. మీకు మీరే ప్రేరణను అందించుకోగలుగుతారు. మార్నింగ్ హాబిట్స్ అంటే ఉదయాన్నే నిద్రలేవడమే కాదు లేచాక ఈ 7 రకాల పనులు చేయడం. కాబట్టి ఎలాంటి ఉదయం అలవాట్లు మీకు ఎలా ప్రేరణను ఇస్తాయో తెలుసుకుందాం.

నిద్రలేచాక మీ రోజును దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవడంతో ప్రారంభించండి. కొంతమంది నిద్ర లేచాక మంచం నుంచి కిందకు దిగడానికే ఆలస్యం చేస్తారు. ఇది మి...