భారతదేశం, నవంబర్ 26 -- Moodam Effect on Marriages: ఈరోజు నుంచి పెళ్లిళ్లకు బ్రేక్. ఈరోజు నుంచి శుక్ర మూఢమి మొదలవుతోంది. దీనినే శుక్ర మౌడ్యమి అని కూడా అంటారు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. ఇక ఈ శుక్ర మూఢం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతోంది? ఈ సమయంలో ఏం చేయకూడదు? శుక్ర మూఢం అంటే అసలు ఏంటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్ర మౌడ్యమి సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, పెళ్లి, ఉపనయనం, గృహప్రవేశం, వాహనాలు కొనుగోలు చేయడం, ఇల్లు కొనుగోలు చేయడం, విగ్రహాలు ప్రతిష్టించడం, బోర్లు వేయించడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, పదవి ప్రమాణ స్వీకారం చేయడం వంటివి చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం వలన సమస్యలు వస్తాయని చెబుతారు. అందుకే శుక్ర మౌడ్యమి సమయంలో వీటిని చేయరు.

ఈ ఏడాది నవంబర్ 26 అంటే ఈరోజు నుంచి శుక్ర మౌడ్యమి ప్రారంభం...