Hyderabad, ఫిబ్రవరి 15 -- హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చాలా వరకూ మన చుట్టూ ఉండే వాతావరణం మీదే ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా, మూడ్ మారుతుండటానికి పలు కారణాలు కూడా ఉండొచ్చు. దాదాపు ఈ మూడ్ స్వింగ్స్ అనేవి టీనేజర్లలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వారు ప్రతి విషయాన్ని ఎమోషనల్ గానే చూస్తుంటారు. కానీ, కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు ఎదురైతే పెద్ద వాళ్లలోనూ ఈ మూడ్ స్వింగ్స్ అనేవి సహజంగా కనిపిస్తాయి.

మూడ్ స్వింగ్స్ ఎందుకు కలుగుతున్నాయని, అర్థం చేసుకుని బిహేవియర్ మార్చుకోగలిగితే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. పీరియడ్స్ సమయంలో కనబరిచే ఫీలింగ్స్ నుంచి రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, చికాకు, విచారం వంటివి అన్నింటినీ మూడ్ స్వింగ్స్ లక్షణాలుగానే చెప్పొచ్చు. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర, విశ్రాంతి తీసుకోవడం వంటి టెక్నిక్స్ పాటించ...