భారతదేశం, ఏప్రిల్ 15 -- ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా ఒక రకంగా రైతులకు శుభవార్త. భారత్ లో అత్యధిక శాతం వర్షాధార రైతులే. వ్యవసాయ రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది శుభవార్త. జనాభాలో 42 శాతం కంటే ఎక్కువ మంది జీవనోపాధి కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. అంతేకాదు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఈ రంగం వ్యవసాయ రంగం వాటా 18%గా ఉంది.

దేశంలోని నికర సాగు విస్తీర్ణంలో, 52 శాతం రుతుపవనాల వర్షంపై ఆధారపడి ఉంటుంది. తాగునీటి సరఫరాతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా రుతుపవాన వర్షాలు కీలకం. "భారతదేశంలో నాలుగు నెలల రుతుపవన కాలంలో (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెం.మీ.లో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వ...