భారతదేశం, ఏప్రిల్ 17 -- Monkey Man OTT: మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత ధూళిపాళ్ల‌. స్ల‌మ్‌డాగ్ మిల‌య‌నీర్ ఫేమ్ దేవ్ ప‌టేల్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో వేశ్య పాత్ర‌లో శోభిత ధూళిపాళ్ల న‌టించింది. ఏప్రిల్ 5న అమెరికా, కెనాడ‌తో పాటు మ‌రికొన్ని దేశాల్లో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌మూవీ రిలీజైంది. ఇండియాలో ఏప్రిల్ 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాగా ఇండియాలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన రెండు వారాల త‌ర్వాత మంకీ మ్యాన్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. మంకీ మ్యాన్ వ‌ర‌ల్డ్ వైడ్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. మే 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. మే ఫ‌స్ట్ వీక్‌లో మంకీ మ్యాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప...