భారతదేశం, జనవరి 30 -- దేశంలో మనీలాండరింగ్, సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టం(Prevention of Money Laundering Act)కు సంబంధించిన కొంత డేటా ఇచ్చింది. ఈ చట్టం కింద ఇప్పటివరకు రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.21,370 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ గణాంకాలు చెబుతున్నాయి. 2005 జూలై 1 నుంచి పీఎంఎల్ఏ చట్టం అమల్లోకి వచ్చింది. పన్ను ఎగవేత, నల్లధనం నిల్వ, మనీలాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలను అరికట్టడమే దీని లక్ష్యం.

ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 911 మందిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు 44 కేసుల్లో పీఎంఎల్ఏ కింద 100 మందిని దోషులుగా నిర్ధారించగా, గత ఏడాది ఏప్రిల్ ను...