Hyderabad, మార్చి 24 -- ఒక మనిషికి నిశ్శబ్దంగా ఉండడం వస్తే చాలు, అతని మనసు అతని అదుపులోనే ఉంటుంది. అతని పనులు అతనికి నచ్చినట్టే జరుగుతాయి. ఎప్పుడైతే మాటను అదుపులో ఉంచుకోలేకపోతాడో అతడికి సమస్యలు ఎదురవుతాయి. నిశ్శబ్దంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే చాలు, మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించేందుకు ఆ నిశ్శబ్దమే సాయపడుతుంది.

మన భారతీయ సంస్కృతిలో మౌనవ్రతం కూడా ఒక భాగమే. ఎంతోమంది వారంలో ఒకరోజు మౌనవ్రతం ఉంటూ ఉంటారు. దీన్ని ఆధ్యాత్మికతకు ముడిపెట్టారు. అలాగే యోగాలో ఒక భాగంగా కూడా ఇది ఉంది. అయితే మౌనవ్రతం అనేది పూర్తిగా ఆధ్యాత్మికమైనదే కాదు, అది మానసిక ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంది. ఇది స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణను నేర్పుతుంది. అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి.

నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకున్న వ్యక్తికి మానసిక, శారీరక ఆరోగ్యం కూడా అద్భుతంగా...