Hyderabad, మార్చి 31 -- నూతన సంవత్సరం రాగానే ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాలను, మార్చుకోవాల్సిన పద్ధతులను రిజల్యూషన్స్ రూపంలో జాబితా తయారు చేస్తారు. అయితే ఆంగ్ల నూతన సంవత్సరానికి ఇలా జరుగుతూ ఉంటుంది. నిజానికి తెలుగు సంవత్సరాది అయిన ఉగాదిలో కూడా మీరు రిజల్యూషన్లు కొన్ని పెట్టుకోవచ్చు. ఇవి మీ జీవితానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.

ఇక్కడ మేము చెప్పిన రిజల్యూషన్లు పాటించేందుకు ప్రయత్నించండి. మీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. మీకు వెనక్కి తిరిగి చూసే అవకాశం రాదు. ఈ తీర్మానాలన్నీ కూడా వాస్తవికంగా ఆచరణాత్మకమైనవి. మీ జీవితాన్నిక్రమంగా మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వ్యక్తిగత అనుబంధాల పరంగా మిమ్మల్ని ఎంతో మెరుగుపరుస్తాయి.

జ్ఞానం ఎంత పెంచుకుంటే మీ జీవితానికి అంత మంచిది. వీలైనంత వరకు ఎక్కువ పుస్తకాలు చదవండి. ఎవరైనా చెప్పింది...