Hyderabad, మార్చి 10 -- జీవితంలో అంతా సుఖమే ఉంటే దాని విలువ తెలియదు. కొన్ని రోజులు కష్టం పడితే ఆ తరువాత వచ్చే సుఖం విలువ వెలకట్టలేనిది. కష్టసుఖాలేవైనా మానవ జీవితంలో భాగమే. కానీ సుఖంగా ఉన్నప్పుడు రాని నెగిటివ్ ఆలోచనలు, కష్టంలో మాత్రం తెగ వస్తాయి. వాటి వల్ల ఉన్న ఆ కొంచెం ప్రశాంతత కూడా పొగొట్టుకున్నారు. ఏదైనా మన మంచికే అన్న పాజిటివ్ ఆలోచనలు ఉంటే చెడు కూడా భవిష్యత్తులో మీకు మంచి చేసే అవకాశం ఉంది. అందుకు ఈ నావికుడి జీవితమే ఉదాహరణ.

ఒక నావికుడు తన సిబ్బందితో సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా, ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఓడ ఆ గాలులకు కొట్టుకుపోయింది. కనీసం ఎటువెళుతోందో కూడా నావికుడికి అర్థం కాలేదు. తన సిబ్భందిని కాపాడుకోవాలని అతనికి ఎంతో కోరికగా ఉంది. కానీ ఏం చేయలేకపోయాడు. ఈలోపు అతనితో పాటూ ఉన్న సిబ్బంది భయంతో లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్ర...