Hyderabad, మార్చి 17 -- జపాన్‌లో స్ఫూర్తివంతమైన వాక్యాలలో ఎక్కువగా 'నానా కరోబి, యా ఓకి ' అని చెప్పుకుంటారు. నువ్వు ఏడుసార్లు పడినా పర్లేదు, ఎనిమిదో సారి కచ్చితంగా నిలబడు అని అంటారు. అంటే ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా తలవంచక ప్రయత్నించమని అర్థం. ఆశను వదులుకోకుండా ప్రయత్నం చేయడం వల్ల ఓటమి వెనకే ఏదో రోజు విజయం కూడా వస్తుంది.

నీకు ఓటమి ఎదురైన ప్రతిసారి ఈ ప్రపంచం నీకు కనీసం విలువ ఇవ్వదు, పూచిక పుల్లలా చూడవచ్చు. నిన్ను మనిషిగా లెక్కించకపోవచ్చు. పడిన ప్రతిసారి పకపకా నవ్వచ్చు. వీడు ఎందుకు పనికిరాడు అనవచ్చు. అయినా మిమ్మల్ని మీరే సమర్థించుకోవాలి. మీకు మీరే స్ఫూర్తినిచ్చుకోవాలి. అతి కష్టం మీద మీరే లేవాలి. మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. నిలదొక్కుకోవాలి. అందరూ ఆశ్చర్య పోయేలా, ప్రపంచం దిమ్మతిరిగేలా గెలిచి చూపించాలి. అప్పుడే మీరు నిజమైన విజేత. ఏడుసార్లు పడినప...